ఇండిగో వివాదంపై లోక్ సభలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

0
Screenshot_2025-12-10-00-41-33-085_com.facebook.katana-edit

ఢిల్లీ: ఎయిర్ పోర్టుల్లో పరిస్థితులు క్రమంగా సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. రిఫండ్, లగేజీని ప్రయాణికులకు చేర్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇండిగో ఇప్పటికే రూ.750 కోట్లు రిఫండ్ చేసింది. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు కూడా ప్రారంభమైంది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా తగిన చర్యలు ఉంటాయి. ఎంతపెద్ద విమానయాన సంస్థ అయినా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు. ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజమాన్యాలదే బాధ్యత.

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్, పైలట్ల పని గంటలకు సంబంధించిన ఈ కొత్త నియమాలు ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అన్ని విమానయాన సంస్థలతో చర్చించిన తర్వాతే డీజీసీఏ వీటిని దశలవారీగా అమలు చేస్తోంది. 2025, జులై ఒకటి నుంచి తొలి దశ, నవంబర్ ఒకటి నుంచి రెండో దశను అమలుచేస్తున్నాం. ఈ నిబంధనలను పాటిస్తామని ఇండిగో హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినప్పటికీ, రోస్టరింగ్ నియమాలను అమలుచేయడంలో వైఫల్యమే సర్వీసుల రద్దుకు దారితీసిందని గుర్తించాం.

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదు.మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *