కథ మారింది.. కౌంటర్ మొదలయింది..!: నటుడు శివాజీకి మాజీ సర్పంచ్ నవ్య మద్దతు..?
తెలంగాణ: అమ్మాయిలు, మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి తప్పుబట్టిన విషయం తెలిసిందే. తమ బట్టలు తమ ఇష్టం అంటూ కౌంటర్ సైతం ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు, నెటిజన్లు శివాజీగా మద్దతు పలకగా
కొందరు మాత్రం అనసూయకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజీకి మాజీ సర్పంచ్ నవ్య మద్దతు తెలిపారు. తమ దుస్తులు తమ ఇష్టం అంటూ శివాజీకి కౌంటర్ ఇస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు పశువులకు ఏం తెలియక బట్టలు కట్టుకోవట్లేదన్నారు. కడుపునకు అన్నం తింటున్నామని, మనుషుల్లాగా బట్టలు కప్పుకోవాలన్నారు. బట్టలు కప్పుకోవాలని, కానీ విప్పుకోకూడదని తెలిపారు. బట్టలు విప్పుకునే వాళ్ల వల్ల మంచి మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. నిక్కర్లు, జబ్బలు కనపడేలా బట్టలు వేసుకునే సంస్కృతి తెలుగువాళ్లది కాదన్నారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సంస్కృతి మంచిదికాదన్నారు. కొందరు మాత్రమే అలా చేస్తున్నారని, వారి వల్ల భారతీయ సంస్కృతి బ్రష్టు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలనాటి సావిత్రి, జమున నిండుగా చీరలతో తీసిన సినిమాలు చాలా హిట్టయ్యాయని గుర్తు చేశారు. డబ్బు సంపాదన కోసం మహిళలను అర్థనగ్నంగా చూపించడం సరికాదని మాజీ సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.
