కర్నూలు వైసీపీ నేతల అరాచకాలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..!
కర్నూల్:
కర్నూల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు బిగుస్తున్న ఉచ్చు.. కర్నూలు జిల్లా ఎస్పీకి ఏపీ మహిళా కమిషన్ నుంచి ఆదేశాలు.
హఫీజ్ ఖాన్ పై మహిళా కమిషన్ కు ఫ్యాషన్ డిజైనర్ పి.శోభారాణి ఫిర్యాదు.. కార్పొరేటర్ టికెట్ ఇస్తానని గతంలో హఫీజ్ ఖాన్ తన నుంచి రూ.3.70 కోట్లు తీసుకున్నట్లు శోభారాణి ఫిర్యాదు.
మున్సిపల్ ఎన్నికల్లో తనకు వైసీపీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోగా హైదరాబాద్ తీసుకెళ్లి తనను బెదిరించి నగ్నపూజకు బలవంతం చేసినట్లు ఆరోపణ.
నిరాకరించిన తనను బెదిరించి లైంగికదాడి చేశాడని హఫీజ్ ఖాన్ పై ఫిర్యాదు.
