యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించిన మంత్రి లోకేష్

0

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించిన మంత్రి లోకేష్


ఏపీ వర్సిటీలతో కలసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ లు ప్రారంభించండి

స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి

రెన్యువబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలసి పనిచేయండి

అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో భేటీ

ఆస్ట్రేలియా (సిడ్నీ): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW) ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు , స్టూడెంట్ ఎక్స్చేంజి పథకాలను ప్రారంభించండి. ముఖ్యంగా STEM, కృత్రిమ మేధస్సు (AI), రెన్యూవబుల్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలసి సంయుక్త పరిశోధనలు చేపట్టండి.

సోలార్, విండ్ పవర్ టెక్నాలజీలలో UNSW నైపుణ్యాన్ని వినియోగిస్తూ పునరుత్పాదక శక్తి పరిశోధనల్లో ఏపీ వర్సిటీలతో కలసి భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్టార్టప్స్‌ను ప్రోత్సహించడానికి UNSW యొక్క మైఖేల్ క్రౌచ్ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతుతో ఆవిష్కరణ కేంద్రాలను నెలకొల్పండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఐటీ, తయారీ రంగాలతో భాగస్వామ్యం వహించి, సంయుక్త పరిశోధన, అభివృద్ధి (R&D), సాంకేతిక మార్పిడి కార్యక్రమాలను బలోపేతం చేయండి. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలీ మెడిసిన్ ప్రజారోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు, మెటర్నల్ హెల్త్ పై సంయుక్త పరిశోధనలు చేపట్టండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, స్థిరమైన పట్టణ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ తో కలసి పనిచేయండి. సమర్థవంతమైన, డేటా ఆధారిత పరిపాలన, పబ్లిక్ పాలసీలపై యుఎన్‌ఎస్‌డబ్ల్యూ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి పంచుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW) ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 1949లో సిడ్నీలో న్యూ సౌత్ వేల్ యూనివర్సిటీ టెక్నాలజీ పేరుతో ప్రారంభమైన యూనివర్సిటీ 1958 నాటికి లీడింగ్ రీసెర్చి యూనవర్సిటీగా అవతరించి యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW)గా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ -50 యూనివర్సిటీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW) గత ఏడాది క్యూఎస్ 45 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 64వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 7వేలమంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతిపెద్ద యూనవర్సిటీగా విద్య, పరిశోధన రంగాల్లో సేవలందిస్తోంది.

తమ యూనివర్సిటీ పరిశోధకులు మొదటి సౌరశక్తితో నడిచే కారు (1987), అధునాతన క్వాంటం కంప్యూటింగ్, HIV/AIDS పరిశోధనలతోపాటు ప్రాణాలను రక్షించే పలు వైద్య చికిత్సలను అభివృద్ధి చేశారు. UNSW నుంచి ఇప్పటివరకు 300+ స్టార్టప్‌లు ప్రారంభం కాగా, ఇన్నోవేషన్ ప్రాజెక్టుల కోసం $1 బిలియన్ కు పైగా నిధులను సేకరించాం. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, సామాజిక అసమానతల నిర్మూలనకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాం.

భారత్ లో జాయింట్ రీసెర్చ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాల కోసం ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాసు యూనివర్సిటీలకు సహకారం అందిస్తున్నాం. ఫ్యూచర్ ఆఫ్ చేంజ్ స్కాలర్ షిప్ కింద 75శాతం ట్యూషన్ ఫీజు స్కాలర్ షిప్ కోసం ఏటా 3వేలమంది భారతీయ విద్యార్థులు మా వద్ద నమోదు చేసుకుంటున్నారు. UNSW ప్రపంచ-ప్రముఖ స్కూల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ రెన్యువబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్‌ను ఉపయోగించుకుని భారతీయ సంస్థలతో సౌరశక్తి ప్రాజెక్టులపై భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రజారోగ్యం, అంటువ్యాధులు, ప్రసూతి ఆరోగ్యంపై ఎయిమ్స్ కు సహకారం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్ ల వంటి భారత టెక్ హబ్ లలో ఏఐ & ఎంఎల్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం తమ యూనవర్సిటీ నిమగ్నమైనట్లు UNSW ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *