రాజమండ్రి సెంట్రల్ జైలుకు మీదున్ -రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!!
రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ – రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!!
విజయవాడ : “లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ కు ఆదేశించింది. మిథున్ ను రాజమండ్రి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో ఏ-4 గా ఉన్న మిథున్ ను విచారించిన సెట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. ఈ రోజు వైద్య పరీక్షల తరువాత కోర్టులో ప్రవేశ పెట్టారు. మిథున్ ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన తరపు న్యాయవాదులు వివరించారు. వై కేటగిరీ భద్రత ఉన్న మిథున్ ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని కోరారు. కాగా, మిథున్ రిమాండ్ రిపోర్టులో సెట్ కీలక అంశాలను ప్రస్తావించింది.”
*రిమాండ్ – ఆధారాలు..:* లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మిథున్ ఏ-4గా ఉన్నారు. కాగా, మిథున్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాసేపట్లో విజయవాడ నుంచి రాజమండ్రికి అధికారులు తరలించనున్నారు. ఇక, మిథున్ రిమాండ్ రిపోర్టు లో సెట్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టు దాఖలు చేసిన సెట్.. మిథున్ కు ఈ కేసులో ప్రమేయం గురించి పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు.
*లోతైన కుట్ర..:* మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదో న్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారని సిట్ అధికారులు వివరిం చారు. లిక్కర్ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవి ష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్ వ్యక్తు లు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకు చ్చారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసు కుని విచారించాల్సి ఉందని రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు.
