ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా రూ.1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

0
IMG-20260120-WA0884

ప్రాధాన్యత క్రమంలో స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పట్టణంలోని స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా రూ.1.80 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనులపై క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ఇంజనీర్లు, ఆత్మకూరు మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

స్టేడియంలో ఇప్పటికే ఉన్న భవనాలను పూర్తి చేయడం, క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, గ్రౌండ్ లెవెలింగ్ వంటి ప్రాథమిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే స్టేడియం లోపల క్రీడా భవనాలు, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లను సిద్ధం చేయాలని సూచించారు.

ఆత్మకూరు క్రీడా ప్రాంగణాన్ని అత్యాధునిక వసతులతో, క్రీడాకారులకు అనువైన ఆహ్లాదకర వాతావరణంతో అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

తొలివిడతగా మంజూరైన నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించి అభివృద్ధి పనులు చేపట్టాలని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *