ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం
తెలంగాణ: ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామని చెప్పారు. నిజామాబాద్లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్ సౌమ్యకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మృతిచెందారు.
