ఏటా 51 మి.మీ వేగంతో కుంగిపోతున్న ఢిల్లీ
ఏటా 51 మి.మీ వేగంతో కుంగిపోతున్న ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరంగా మారుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏటా 51 మిల్లీమీటర్ల చొప్పున భూమి కుంగిపోతుందని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల వేలాది భవనాలతో పాటు 17 లక్షల మంది నివాసితులు ప్రమాదంలో పడ్డాయని, రాబోయే 30-50 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రముఖ సైన్స్ జనరల్ ‘నేచర్’ ప్రచురించింది.
