ఏపీలో సీనియర్ ఐఏఎస్ కూతురు ఆత్మహత్య?
అమరావతి: ఏపీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్న రాముడు,కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్‌ను మాధురి,కులాంతర వివాహం చేసుకుంది.
ఈ క్రమంలోనే అత్తింటి వారి వేధింపులు భరించలేక కేవలం 4 నెలల్లోనే పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నాళ్ల నుంచి ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లిన మాధురి తాజాగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ను
రాజేష్,ట్రాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తండ్రి చిన్న రాముడు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బిడ్డది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదని తానే దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ చేయించానని అన్నారు.
అబ్బాయి కుటుంబ సభ్యులకు నంద్యాల పోలీసుల సమక్షంలో మ్యారేజ్ చేస్తానని చెప్పినా వద్దన్నారని తెలిపారు. అంతకు ముందు కూడా మరో అమ్మాయిని ఇలానే చేశాడని తర్వాత వారి ఊళ్లో ఎంక్వైరీ చేస్తే తెలిసిందని అన్నారు. రాజేష్ విలాసాలకు అలవాటు పడి ఇలా అమ్మాయిని మోసం చేస్తున్నాడని తనతో పడని వారి బైక్‌లు, ఇతర వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టడం అతడి హాబీ అని మృతురాలి తండ్రి ఆరోపించాడు.
