ఏపీ ప్రభుత్వం నుండి మరొక అదిరిపోయే శుభవార్త
అమరావతి
: ఏపీ ప్రభుత్వం నుండి మరొక అదిరిపోయే శుభవార్త…ఇకపై వాట్సప్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల పేమెంట్స్.. ఎఫ్ఐఆర్ సేవలు కూడా.. ఎలా అంటే..?
ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో తీపికబురు అందించింది. వాట్సప్ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలు సులువుగా పొందే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పోలీస్ సర్వీసులను కూాాడా ఇందులో చేర్చింది.
ఇప్పటికే ప్రభుత్వం ఇన్ కం, రెసిడెన్షియల్, కులం లాంటి ప్రభుత్వ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ, దేవాలయాల్లో దర్శనం టికెట్లు బుకింగ్ లాంటివి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందే అవకాశం కల్పించింది. దీని వల్ల ప్రజలు ఒకేచోట అన్నీ ప్రభుత్వ సేవలు పొందుతున్నారు.
ఎలా అంటే..?
95523 00009 నంబరును ఫోన్లో సేవ్ చేసుకోవాలి
తర్వాత వాట్సప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌కు బీఖి అనే మెస్సేజ్ పెట్టాలి
మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి
పోలీస్ శాఖ సేవలను సెలక్ట్ చేసుకోవాలి
ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్టేటస్, ఈ చలాన్లు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
మీకు కావాల్సిన వాటిని సెలక్ట్ చేసుకోవాలి
చలాన్ చెల్లించాలంటే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి
మీ బండిపై ఉన్న చలాన్ల వివరాలు కనిపిస్తాయి
బ్యాంకు ద్వారా చెల్లించి రసీదు పొందవచ్చు.
