ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు
వెళ్లారు. ఈ నెల 22న శ్రీకాంత్ కుమారుడు రాజశేఖర్‌కు వివాహమైంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలోని ఇంటికి వెళ్లి నవదంపతులు రాజశేఖర్, సౌమ్యలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
