కర్ణాటక బ్యాడిగ మిర్చి ( Byadgi Chilli) : గరిష్ఠ ధర పలుకుతున్న డబ్బి బ్యాడిగ రకం మిర్చి
మార్కెట్లో భారీగా పెరిగిన మిరప ధర – క్వింటాలు రూ.70 వేలకు పైనే!
రెండేళ్లుగా ధరలు నేలచూపులు చూడటంతో: విత్తన రకాలైన తేజ, 5531, 2043, 273 ధరలు గత ఏడాది క్వింటాలు రూ.11 వేల లోపు ఉండేది. ఈసారి రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు అధిక ధర పలుకుతున్నాయి. నాణ్యతను బట్టి ఒక్కో రకం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెరిగింది. జూన్‌లో పంట సాగు చేసిన రైతులకు ఈనెల మొదటి వారంలో మొదటి కోత చేతికొచ్చింది. మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో రైతులు తీసుకు వచ్చిన పంటను వ్యాపారులు వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
రెండు ఏళ్లుగా మిర్చి ధరలు నేలచూపులు చూడడంతో రైతులు నష్టపోయారు. దీంతో ఈ సంవత్సరం చాలామంది సాగు చేసేందుకు ముందుకు రాలేదు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మిరప పంట దిగుబడి తగ్గింది. కర్ణాటకలోను కూడా ఆశించిన స్థాయిలో సాగవ్వలేదు. ఫలితంగా మిరపకు ఈ సంవత్సరం అనూహ్యంగా డిమాండ్ ఏర్పడిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
