కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ


అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రామ్మోహన్ రావును పరామర్శించారు. రామ్మోహన్ రావు తల్లి వెంకటనరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
