గవర్నర్‌ను ఆహ్వానించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కార్యాలయంలో భేటీ అయిన స్పీకర్, సంప్రదాయం ప్రకారం గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. స్పీకర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర
కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వారు గవర్నర్‌కు వివరించారు. రేపు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
