గాజా శాంతి మండలిలో భారత్‌కు ఆహ్వానం.. పాకిస్తాన్‌కు కూడా చోటు!
pఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. ఈ మండలిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దక్కింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. గాజా పరిపాలన, పునర్నిర్మాణ పనుల కోసం అమెరికా రెండు ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ప్రధానమైన శాంతి మండలికి ట్రంప్ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
