చత్తీస్ ఘడ్ లో ఘోర రైలు ప్రమాదం?
చత్తీస్ ఘడ్ లో ఘోర రైలు ప్రమాదం?
అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది బిలాస్‌పుర్‌లో ప్యాసింజర్, గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు మరో 25 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే, ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది రెస్క్యూ, వైద్య బృందాన్ని సంఘటనా స్థలానికి చేరుకున్నారు
. స్థానిక యంత్రాంగం కూడా సహాయం అందించడానికి అక్కడికి చేరుకుంది.
అయితే ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వైళ్లే రైళ్లలో పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అధికారులు ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. బిలాస్‌పూర్-కట్ని విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.
