ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక
సందడి చేసిన మంత్రి నారా లోకేష్





కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రామ్మోహన నాయుడు మాతృమూర్తి లోకేష్‌ను ఆశీర్వదించారు. రామన్న పిల్లలను ఎత్తుకున్న లోకేష్ వారితో సరదాగా మాట్లాడించారు. పెద్దమ్మ పురందరేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంపీలందరినీ పేరుపేరునా పలకరిస్తూ సందడి చేశారు.
