తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు
తిరుమల
: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి మూడు రోజులు పాటు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
