తిరుమలలో సెంట్రలైజ్డ్ సి ఆర్ ఓ కార్యాలయం

0

తిరుమలలో సెంట్రలైజ్డ్ సి ఆర్ ఓ కార్యాలయం

పాత భవనాలను తొలగించి కొత్తగా నిర్మాణాలు

షాపులు, హాకర్ లైసెన్సులు రెన్యువల్

74 మంది అనధికారిక హాకర్ల ఫైల్ తిరస్కరణ

139 మంది నిర్వాసితుల అభ్యర్థనకు నో

తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం తర్వాత అంతటి ప్రధాన సమస్య అయిన అకామిడేషన్, కాటేజీలు గదుల లభ్యతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే సాధారణ భక్తులకు 1200 కాటేజీలు వీఐపీలకు 6200 గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈ గదులు కాటేజీలు సామాన్య భక్తులు పొందడానికి ప్రస్తుతం సి ఆర్ ఓ కార్యాలయం వద్ద సరైన సౌకర్యాలు లేకుండా గంటల తరబడి వేచి ఉండి సెల్ఫోన్లకు మెసేజ్లు ద్వారా వివిధ పద్ధతుల ద్వారా నానా ఇబ్బందులు పడి గదులు పొందాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని అధిగమిస్తూ ఇకపై సామాన్య భక్తులు కూడా కొండపై కాటేజీలను సులభంగా తొందరగా లభించే విధంగా నూతనంగా ఆధునీకరణ ఉట్టిపడేలా సి ఆర్ ఓ కార్యాలయాన్ని నిర్మించాలని బోర్డు తీర్మానించింది.

ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉండేలా బ్యాంకింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ అనే పేరుతో ఉన్న పెద్ద స్థలంలో పాత భవనాన్ని పూర్తిగా కూల్చివేసి ఆ స్థలంలో సెంట్రలైజ్డ్ సి ఆర్ ఓ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించడానికి పాలకమండలి పచ్చ జెండా ఊపింది. ఈ సెంట్రలైజ్డ్ సి ఆర్ ఓ కార్యాలయం చుట్టూ అనేక వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ, భక్తులు వేచి ఉండేందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, సులభంగా గదులు కాటేజీలు పొందేందుకు అన్ని విధాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కార్యాలయంలోనే అందుబాటులోకి తీసుకురావాలని అందుకు తగిన ప్రణాళికలు ఏర్పాట్లు సిద్ధం చేయాలని బోర్డు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా కొండపై అక్కడక్కడ పురాతన కాలం నాటి భవనాలను తొలగించి వాటి స్థానంలో మరింత మందికి బస వసతి కల్పించేలా కొత్త నిర్మాణాలను చేపట్టాలని పాలకమండలి తీర్మానించింది.

అంతేకాకుండా తిరుమల కొండపై స్థానికులకు కేటాయించి ఉన్న 1200 దుకాణాలు, 720 ఆఖరు లైసెన్సులు పాత పద్ధతిలోనే యధావిధిగా మూడేళ్ల పాటు రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 151 మంది అనధికారిక హాకర్లలకు అధికారికంగా లైసెన్సులు మంజూరు చేసేందుకు రెవెన్యూ పంచాయతీ విభాగం అధికారులు ప్రతిపాదించిన అంశాన్ని బోర్డు తిరస్కరించింది. 151 మంది అనధికారిక తట్టలకు సంబంధించి 74 మంది వ్యక్తులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు తగిన అర్హతలు ఉన్నాయని టిటిడి రెవెన్యూ పంచాయతీ ఫైళ్లను బోర్డు పంపగా, దీనిపై చైర్మన్ పాలకమండలి సభ్యులు స్పందిస్తూ వాస్తవానికి అందులో 29 మంది మాత్రమే స్థానికంగా ఉన్నట్లు అర్హతలు ఉన్నాయని వారికి కూడా లైసెన్సులు మంజూరు చేయాలంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వాటి వివరాలను తగిన నివేదికను తదుపరి సమావేశానికి అందించాలని బోర్డు ఆదేశించింది.

139 మంది తిరుమల నిర్వాసితులకు తగిన పునరావాసం చూపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా వచ్చిన ప్రతిపాదనపై పాలకమండలి చర్చలు జరిపిన అనంతరం ఇప్పటికే తిరుమల కొండపై అభివృద్ధికి సహకరించిన స్థానికులు అందరికీ పునరావాసం కింద ప్రత్యామ్నాయం కింద షాపులు, హాకర్ లైసెన్సులు, నివాస గృహాలు కేటాయించడం జరిగిందని, ఇంకా ఇంతమంది నిర్వాసితులు ఉన్నట్లు తాము భావించడం లేదని ఈ ప్రతిపాదనను అభ్యంతరం వ్యక్తం చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని అందించాలని బోర్డు తీర్మానించింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కామన్ గుడ్ ఫండ్ కింద ఇప్పటికే టీటీడీ నుంచి అందిస్తున్న నిధులు సరిపోతాయని, ప్రత్యేకంగా తొమ్మిది శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయబడింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని నిబంధనలు నియమాలు పాటించడం జరుగుతుందని బోర్డు సభ్యులు వెల్లడించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *