తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్

0

తెలంగాణ : ధాన్యం రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేసింది.

క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1,939.58 కోట్ల రూపాయల బోనస్‌ను చెల్లించింది. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా .. ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపులు, ఎమ్‌ఎస్‌పీతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. పెండింగ్ బకాయిలు విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *