మాలేపాటి కుటుంబాని పరామర్శించిన : లోకేష్
మాలేపాటి కుటుంబాని పరామర్శించిన : లోకేష్




నెల్లూరు: ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబసభ్యులను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరామర్శించారు.
మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భానుచందర్ నాయుడు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి మాలేపాటి కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సుబ్బనాయుడు సతీమణి ని ఓదార్చి, నేను ఉన్నానంటూ దర్యం చెప్పారు.
కార్యక్రమంలో ఎంపి వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్థాన్ రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు
