నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పూర్తి
తెలంగాణ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నేటి
తో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని 25 డిసెంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) లోతుగా విచారించింది.
