నేటి నుంచి నెల్లూరు జిల్లాలో జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం
నేటి నుంచి నెల్లూరు జిల్లాలో జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం పర్యటించనుంది.

కలెక్టర్ కార్యాలయం లో ఆనంద్ ను బృంద సభ్యులు డాక్టర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ మణికందన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన బృంద సభ్యుల జిల్లా పర్యటనలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలను సభ్యులకు వివరించాలని సూచించారు. ఉపాధిహామీ, సామాజిక పింఛన్లు, గృహనిర్మాణం మొదలైన పథకాల అమలుతీరును బృందసభ్యులు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. వచ్చేనెల 2వ తేదీ వరకు జిల్లాలో సభ్యులు పర్యటించనున్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి గంగాభవాని, జడ్పీ సిఇవో మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
