పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి
పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి
పరిశ్రమలు ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మీటింగ్
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 1700 దరఖాస్తులు రాగా అందులో 1616 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని 20 దరఖాస్తులు తిరస్కరించగా 64 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రిజెక్ట్ అయిన దరఖాస్తులకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు నుడా శాఖలు తగు వివరాలను కలెక్టర్ కు తెలియజేశారు. పెండింగ్ అప్లికేషన్ ఎక్కువగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు లీగల్ మెట్రాలజీ శాఖలు వాటిని మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మెగా ప్రాజెక్టుల ద్వారా 13599 మందికి మరియు పెద్ద పరిశ్రమల ద్వారా 5557 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తున్న ర్యాంపు కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృత స్థాయిలో చేపట్టాలన్నారు. దానికి సంబంధించిన వర్క్ షాపులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బిజినెస్ రీఫాం యాక్షన్ ప్లాన్ కింద రిఫార్మ్స్ మంజూరు అయిన 3366 మందికి గాను 3227 మందికి రీ ఫాన్స్ పూర్తి చేయడం జరిగిందన్నారు. రీఫామ్స్ విషయంలో కమర్షియల్ టాక్స్ మరియు లేబర్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ శాఖలు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి అన్నారు. అనంతరం జాసన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఉత్కర్ష అల్యూమినియం దాతునిగా0 లిమిటెడ్, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఏర్పాటుకు సంబంధించి పురోగతిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైమ్మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 76 దరఖాస్తులను ఫిజికల్ గా గ్రౌండ్ చేయడం జరిగిందని అదే విధంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున 19 దరఖాస్తులను గ్రౌండ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామును వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయవలసిందిగా ఆయన సూచించారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం మారుతి ప్రసాద్, ఏపీఐఐసీ జెడ్. ఎం శివకుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారులు పావని, అనూష మరియు వంశీకృష్ణ, జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ మెంబర్ వి. భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు…
