పల్లె పోరులో మరోసారి కాంగ్రెస్ దే హవా!
తెలంగాణ: తెలంగాణలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు పూర్తయింది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, సర్పంచ్ పదవుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 272 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు.
అలాగే బీఆర్‌ఎస్ (BRS) పార్టీ మద్దతుదారులు 32 స్థానాల్లో విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు 13 స్థానాలను గెలుచుకున్నారు. ఇక ఇతర పార్టీలు (OTH), స్వతంత్ర అభ్యర్థులు మద్దతుదారులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో 72 సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు.
ఇదిలా మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లో కాస్త నెమ్మదిగా ఓట్ల లెక్కింపు కొనసాగు తుంది. దీంతో పలితాల వివరాలు ఆలస్యంగా అందుబాటులోకి వస్తున్నాయి. వెళ్లడైనా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొల్లంపల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్వాల శంకర్ గెలుపు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి సర్పంచ్ బానోత్ రాజ్య నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతపుల నరేందర్ గెలుపు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడి చింతలపల్లి సర్పంచిగా సున్నం రాజయ్య కాంగ్రెస్ పార్టీ గెలుపు,
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్ శ్యామ్ దాస్ నగర్ సర్పంచ్ గా అత్తపై కోడలు గెలుపు,
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ లో ఒక్క ఓటు పోస్టల్ బ్యాలెట్ తో సర్పంచ్ గా విజయం సాధించిన శ్రీ వేద,
కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం పోతంగల్ ఖుర్జ్ గ్రామపంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
