పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించిన: కమిషనర్ వై.ఓ నందన్

0

నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో పర్యటించారు.

వర్షాలకు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరడంతో అందుగల కారణాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సమీపంలోని డ్రైన్ కాలువ ద్వారా మురుగునీరు లీకేజీ అయి బ్రిడ్జి కిందకు చేరుతోందని కమిషనర్ గమనించి వెంటనే మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం స్థానిక లెక్చరర్స్ కాలనీ ప్రాంతంలో విద్యుత్ వీధి దీపాల నిర్వహణ, నూతన రోడ్ల నిర్మాణం పనులు, డ్రైను కాలువలలో పూడికతీత, కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం, మెగా డ్రైను కాలువ నిర్వహణ తీరును కమిషనర్ పరిశీలించారు.

స్థానికంగా నిర్మిస్తున్న నూతన భవనాలకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులను పరిశీలించి, అనుమతించిన మేరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని యజమానులకు సూచించారు. భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసే కొలతలు వేసి సరిపోల్చారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *