పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల
నెల్లూరు జిల్లా: నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన పెంచలయ్య హత్య కేసు బాధిత కుటుంబాన్ని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల పరామర్శించారు.
కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక వేదనను అర్థం చేసుకుని, వారికి అన్ని విధాలా త్వరితగతిన చట్టపరమైన సహాయం, రక్షణ మరియు న్యాయం అందించబడుతుందని ఎస్పీ హామీ ఇచ్చారు.
పెంచలయ్య హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే ప్రధాన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారి పాత్ర గురించి లోతుగా విచారణ కొనసాగుతుందని తెలిపారు.
పరామర్శ అనంతరం, ఎస్పీ పెంచలయ్య కుటుంబ సభ్యుల చేతుల మీదుగా “గంజాయి వ్యతిరేక అవగాహన పోస్టర్లు”ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారి పిల్లలతో యస్.పి. మాట్లాడుతూ పెంచలయ్య ఆశయాలను, స్పూర్తిని కొనసాగించడంలో జిల్లా పోలీసులు అన్ని విధాలా ముందు ఉండి సహకరిస్తామని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 112 కు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలన్నారు


.
