ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి “నారా లోకేష్ విద్యాఅమృతం” పేరిట శ్రీకారం.
నియోజకవర్గంలో 32 ఉన్నత పాఠశాలలో 1836 విద్యార్థిని, విద్యార్థులకు 100 రోజులు పౌష్టికాహారం.
నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది.
ఏలూరు/ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం తన తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి “నారా లోకేష్ విద్యాఅమృతం” పేరిట రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టి, సంబంధిత ఉన్నత పాఠశాలలకు విద్యాఅమృతం సరుకుల వాహనాలను జెండా ఊపి ఆయా మండలాలకు పంపించారు. విభిన్న ప్రతిభావంతులు క్రీడల్లో గెలుపొందిన నాలుగు మందికి ప్రశంశా పత్రాలు, మెడల్స్ ను అందించి వారిని అభినందించారు. దాతలు సమకూర్చిన క్రీడా పరికరాలను విద్యార్థులకు అందించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపును తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పీ4 కార్యక్రమాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ ను ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. మా తండ్రి నిరుపేద కుటుంబం లో పుట్టారని, ఆర్టీసీలో ప్రయాణం చేస్తే డబ్బులు అవుతాయని క్వారీ లారీలను ఆపి ప్రయాణించేవారని, మా తల్లి, నన్ను అలాగే ప్రయాణం చేసేలా చేసేవారని అన్నారు. ఆయన చేసిన సేవలు, పడ్డ కష్టానికి రుణం తీర్చుకోవాలని ఆయన పేరిట చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కేవలం రెండు నెలలు ముందు నియోజక వర్గానికి వచ్చినను, ప్రజలు మంచి మెజారిటీతో గెలుపు నిచ్చారని ప్రజలకు ఎన్నిసేవలు చేసినా తక్కువ అవుతాయని అన్నారు. నూజివీడు నియోజక వర్గంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న విద్యార్థులు కోసం నా తండ్రి సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటల్ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలకు “నారా లోకేష్ విద్యామృతం” పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్ధులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చదువులో ఏకాగ్రత పెంపొందించడం, మంచి ఫలితాలు రావాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలు మరియు నూజివీడు పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు అల్పాహారం ఈ రోజునుండి అందించ నున్నామని తెలిపారు.ఈ సేవా కార్యక్రమాన్ని నా తండ్రి కొలుసు పెద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్” ద్వారా అమలు చేయడం జరుగు తోందని, గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుట నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని అన్నారు. నూజివీడు నియోజక వర్గంలో 32 ఉన్నత పాఠశాలలు, మొత్తం విద్యార్థులు సంఖ్య 1,836 మంది ఉన్నారని అన్నారు. పబ్లిక్ పరీక్షలు అయ్యేవరకు 100 రోజులు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు మధ్యాహ్నం పౌష్టిక అల్పాహారం అందించ బడుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి వారానికి సుమారు రూ 1.5 లక్షలు చొప్పున 100 రోజులకు రూ 20 లక్షలు అవుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోషకాహార లోపం లేకుండా చదువుపై పూర్తి దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ “లోకేష్ గారి విద్యామృతం”పేరిట నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి ఒక మైలురాయిగా నిలవనుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉప విద్యా శాఖ అధికారి డా. పి. యస్.సుధాకర్, తహశీల్దారు ప్రసాదు, యంపిడివో బి.భార్గవి, డివిజన్ వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఉన్నత పాఠశాల హెచ్ యం పి.పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యా కమిటి చైర్మన్ ఆవుల నరేష్, నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తల్లితండ్రులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
