ప్రభుత్వ పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా అరాచకాలు బట్టబయలు!

0

ప్రభుత్వ పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా అరాచకాలు బట్టబయలు!పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అండదండలతోనే అటెండర్ యాకుపాషా అరాచకాలు?

తెలంగాణ: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ లో ఎన్నో సంచలన విషయాలు బయట పడ్డాయి.

యాకుబ్ బాషాకు సంబంధించి పోక్సో కేసు కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా రహస్య విచారణ చేపట్టారు. కొన్ని విస్తబోయే నిజాలు బయటపడ్డాయి. బాలికలపై గత కొంత కాలంగా అటెండర్ యాకుబ్ భాషా, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు నిర్ధారణ అయింది. తరగతి గదిలో, విశ్రాంతి గదుల్లో బాలికల పట్ల అత్యంత అసభ్యకరంగా జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాడని, యాకుబ్ పాషాపై చర్యలు తీసుకోవాలని గతంలోనే బాలికలు స్కూల్ హెడ్ మాస్టర్, కమలకు ఫిర్యాదు చేశారు.

కాగా యాకుబ్ బాషాను పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు కమల, వెనుకేసు కొచ్చారు. ఈ విషయం ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాను అని హెడ్మాస్టర్ కమల పదవ తరగతి బాలికలను బెదిరించారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికలు భయపడి ఎవరికి చెప్పలేకపోయారు. టీసీ ఇస్తే మా భవిష్యత్తు ఏమైపోతుందోనని,వాడీ అరాచకాలు భరించారు. హెడ్మాస్టర్ కమల అండ దండలతోనే అటెండర్ యాకూబ్ బంగారం బాషా, ఈ దారుణాలకు పాల్పడ్డాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ తీగలాగితే డొంక కదిలినట్లుగా త్రిసభ్య కమిటీ విచారణతో యాకు బ్ భాషా అరాచకాలు ఒక్కొక్కటి బయటపడు తున్నాయి. బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు బయటపడడం తో ఈ వ్యవహారం పై కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు వెంటనే హెడ్మాస్టర్ కమలను సస్పండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ చర్యలకు వెనకాడకూడదని కలెక్టర్ పోలీస్ అధికారులకు సూచించారు.

యాకూబ్ బాషాకు అను కూలంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు అధికారుల తప్పిదాలవల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *