ప్రాజెక్టుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన: మంత్రి టీజీ భ‌ర‌త్

0

ఢిల్లీ

: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క అధునాతన రక్షణ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. మంత్రి టీజీ భ‌ర‌త్ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన రక్షణ తయారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి అధికారికంగా ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా డిఫెన్స్ ఎనర్జిటిక్స్ & మందుగుండు సామగ్రి ఫిల్లింగ్ కాంప్లెక్స్, మడకశిర, HFCL ద్వారా ఆర్టిలరీ షెల్ & మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్ సౌకర్యం, దొనకొండ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా ప్రొపెల్లెంట్ & వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సౌకర్యం, అనకాపల్లిలోని BDL ద్వారా అండర్ వాటర్ వెపన్స్ & టార్పెడో తయారీ యూనిట్ ల శంకుస్థాప‌న‌కు ఆహ్వానించారు. ప్రాజెక్టుల‌కు రాష్ట్రం నుండి పూర్తి మద్దతు, వేగవంతమైన ఆమోదాలు ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిపై చ‌ర్చించిన‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రితో చాలా సానుకూలంగా చ‌ర్చ సాగిన‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *