ఫైల్స్ క్లియరెన్స్ లో నెల్లూరు జిల్లాకు రెండోస్థానం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు

0
IMG-20251211-WA0681

నెల్లూరు జిల్లా: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను 17 గంటలో వేగంగా పరిష్కరించడంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్లను త్వరగా పరిష్కరించడంలో కలెక్టర్ల పనితీరుకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు మూడు నెలల్లో ఈ-ఫైల్స్ క్లియరింగ్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో ఉండగా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ద్వితీయ స్థానంలో, విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. జిల్లాలో గడిచిన మూడు నెలల్లో వివిధ శాఖల నుంచి 682 ఫైల్స్ రాగా 628 ఫైళ్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల క్లియర్ చేశారు.

ఈ మేరకు సీఎం కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *