భారీగా పెరిగిన బంగారం ధర
పసిడి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
