మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర…. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్
అమరావతి



: సుప్రీమ్ కోర్టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటి మరియు గౌరవ ఆధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు లాయర్లకు “మధ్యవర్తిత్వము” అనే అంశం పై శిక్షణా తరగతులను ది. 19.01.2026 నుండి 23.01.2026 వరకు విజయవాడ కోర్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. సదరు శిక్షణా తరగతులను కార్యనిర్వాహక కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 35 మంది లాయర్లకు “Concept and Techniques of Mediation “ అనే అంశం పై తరగతులను నిర్వహించడానికి తమిళనాడు హైకోర్టు న్యాయవాదులు మరియు సీనియర్ Trainers అయిన శ్రీమతి R. విజయకమల మరియు శ్రీమతి సత్యారావులు నియమింపబడ్డారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయ మూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు తక్కవ ఖర్చుతో, తక్కువ సమయంలో త్వరితగతిన పరిష్కారం అందించుట కోసం సుప్రీమ్ కోర్టు ఈ మీడియేషన్ అనే అంశాన్ని ప్రవేశ పెటారని, దానిలో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 35 మంది న్యాయవాదులకు 2nd phase లో శిక్షణ ఇస్తున్నారు అని జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలియచేశారు. Mediation లో కేసుల సెటిల్మెంట్ విషయంలో న్యాయవాదులదే ప్రముఖ పాత్ర అని, అందుకే న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారు అని, అలాగే న్యాయవాదులు అందరూ కేసుల పరిష్కారం విషయం లో తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో ఇది 6వ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని తెలిపారు. మొదటి రెండు ప్రోగ్రామ్స్ క్లస్టర్ డిస్ట్రిక్ట్స్ అయిన కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో పనిచేస్తున్న న్యాయ మూర్తులకు 3 వ ప్రోగ్రామ్ లో కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న న్యాయ మూర్తులకు, 4,5 ప్రోగ్రామ్స్ లో న్యాయ వాదులకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలియ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది trained Advocate Mediators unnaru అని, ఈ 2nd phase లో మరో 35 మందికి ఈ శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు.
APSLSA సభ్య కార్యదర్శి smt BSV హిమబిందు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ phase లో మరో 400 మంది న్యాయవాదులకు ఈ శిక్షణ తరగతులు chepattaamu అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపి, APSLSA సభ్య కార్యదర్శి బి. ఎస్. వీ. హిమ బిందు, II. అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి A సత్యానంద్, DLSA కార్యదర్శి K.V. రామకృష్ణయ్య, డిప్యుటి సెక్రటరి APSLSA H. అమర రంగేశ్వర రావు మరియు ఇతర న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇవి 23 వ thariku వరకు కొనసాగుతాయి. Participants అందరూ ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకుని అనేక కేసులను సత్వరం పరిష్కరించే దిశలో అడుగులు వేయాలని వక్తలు అందరూ సూచించారు.
