మనోజ నంబూరి కృషికి జేజేలు : మంత్రి నారా లోకేష్
విజయవాడ: బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది, ఆకు పచ్చని కల సాకారం చేస్తున్న విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ మనోజ నంబూరి కృషికి జేజేలు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ అభినందనీయులు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని బడి తోటలో పండించిన కూరలైనా, పండ్లు అయినా 










విద్యార్థులు పంచుకోవటం, మధ్యాహ్న భోజనంలో వాడటం మంచి సంప్రదాయం అని అన్నారు.
