మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై బిజెపి ఆక్షేపణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఒక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై బిజెపి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది
.
ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ఓటర్లను ప్రభావితం చేసే దుష్ప్రయత్నంగా పేర్కొంటూ బిజెపి ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు సమర్పించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ అనైతిక చర్యలను తక్షణమే అడ్డుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది.
