మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!
మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!

కృష్ణాజిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శిస్తున్నా రు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ కీ స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఇదిలాఉంటే దారిపొడవు నా జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
