మానవత్వమే మించిన దైవం: అయ్యప్ప స్వామి భక్తుడి ప్రాణాలను కాపాడిన హోటల్ వ్యాపారి!
శబరిమల యాత్రలో ఒక అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. కేరళలోని శబరిమల నీలిమలై కొండ ఎక్కుతుండగా చెన్నైకి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
అదే సమయంలో అక్కడ ఉన్న బెల్గాం (గోకాక్) హోటల్ వ్యాపారి ప్రభాకర్ శెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. చలి తీవ్రత వల్ల అది గుండెపోటు అని గ్రహించి, వెంటనే ఆయన ఛాతీపై చేతులు ఉంచి పంపింగ్ (CPR) చేశారు. ప్రభాకర్ సమయస్ఫూర్తితో ఆ మాలధారికి స్పృహ వచ్చి ప్రాణాలు నిలిచాయి.
ప్రభాకర్ శెట్టి

మాటల్లో: అయ్యప్ప స్వామియే నా ద్వారా ఈ మంచి పని చేయించి ఆయన్ని కాపాడారు. ఆ భక్తుడు త్వరగా కోలుకోవాలని నేను స్వామి సన్నిధానంలో ప్రార్థించాను.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడి నిజమైన ‘మానవత్వాన్ని’ చాటుకున్న ప్రభాకర్ శెట్టి అభినందనలు.
