మార్చి 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.!

0

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కాబోతోంది.

ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండాగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *