మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షిస్తున్న మంత్రి లోకేష్
అమరావతి: మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్




సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు
పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్
మొంథా తీవ్ర తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వివరించిన అధికారులు
ఏ ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటుతుందో అధికారులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్
నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
తుఫాను ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్
మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలో ఉద్యానపంటలు దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ కు వివరించిన అధికారులు.
