రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం
తెలంగాణ: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2854 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రుసుం రూ.3లక్షలు చొప్పున వసూలు చేశారు. 2023లో దరఖాస్తుల రుసుం రూ.2 లక్షలు ఉండగా.. రూ.2640 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా రుసుం రూ.3లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గినా గతం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది.
