రేపు నెల్లూరు జిల్లా లో రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

0

రేపు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

నెల్లూరు రూరల్, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్ పి ఆర్ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ మండల పరిధిలోని 17వ డివిజన్ వడ్డిపాలెంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం 12.30 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని యాదవ బజార్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం భీమవరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొంటారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *