రేపు దావోస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రపంచ ఆర్ధిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు

0

ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈఓలతో చర్చలు

స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు

తొలిరోజు 20 దేశాలకు చెందిన ఎన్నార్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం

4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

23వ తేదీన భారత్‌కు తిరిగి రానున్న ముఖ్యమంత్రి

అమరావతి

: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది. 4 రోజుల పాటు దావోస్‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్న సీఎం..అక్కడి నుంచి జ్యూరిచ్‌కు వెళ్తారు. ఢిల్లీలో 19 తేదీన రాత్రి 01.45 గంటలకు బయల్దేరి ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు కూడా ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్‌టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళ్తారు. దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం అవుతారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్యూ ఇవ్వనున్నారు.

దిగ్గజ పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం ముఖాముఖి

దావోస్ రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్ పేరిట సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ భేటీకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరుకానున్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్‌లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ బీసీ ఇంటర్నేషనల్‌కు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు సెషన్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో సీఎం చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత- స్విస్ ఫ్రెండ్ షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో సీఎం భేటీ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్ధిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్లడ్జ్కీ తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరపనున్నారు. రెండో రోజు సాయంత్రం జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జెఎస్ డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్ధ్ జిందాల్‌తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్ తో సీఎం ముఖాముఖి సమావేశం అవుతారు. ఈ రెండు సమావేశాలకూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుడా హాజరు కానున్నారు. అనంతరం జాన్ కాక్రిల్ సంస్థ గ్రూప్ సీఈఓ జీన్ లక్ మారాంగేతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ- డెప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ చర్చలకు సీఎం హాజరు

దావోస్‌లో మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడెమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్ లు సమావేశం ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారు. అనంతరం ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ తర్వాత ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చా కార్యక్రమంలోనూ సీఎం పాల్గోంటారు. బ్లూమ్ బెర్గ్ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్సాఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. ఏపీ లాంజ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరు అవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజెనరేషన్ మొబిలైజింగ్ కేపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తంగా దావోస్‌లో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో 16 వన్ టు వన్ సమావేశాలు జరగనున్నాయి. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌లో సీఎం పాల్గొంటారు. సీఎన్బీసీ ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తారు. పర్యటన తొలి రోజున జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పొరా మీటింగ్‌లో పాల్గొంటారు. జనవరి 22 తేదీన దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని స్విడ్జర్లాండ్ కాలమానం ప్రకారం 2.35 గంటలకు స్వదేశానికి బయల్దేరి రానున్నారు. 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *