రైతుల భూములకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా/ఆత్మకూరు: రైతాంగానికి, ప్రజలకు మంచి చేయాలనే గొప్ప ఆలోచనలతో పని చేస్తున్నాం.
మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఉప్పలపాడు గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన స్థానిక నేతలు, గ్రామస్థులు
అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం: మంత్రి ఆనం
ప్రభుత్వ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్ తో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి ఆనం
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి ఆనం.
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోటుతో సమానం విలువ లేనివి.
తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తున్న కరెన్సీ నోట్ల వలె విలువ గలవి భద్రతాపరంగా చట్టబద్ధత కలిగినవి.
ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వున్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి.
రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు,రైతన్నలకు అండగా నిలుస్తాం: మంత్రి ఆనం
ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను విజయవంతంగా అమలు చేశాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వమే 1144 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉచిత బస్సు..స్త్రీ నిధి పథకాన్ని అమలు చేస్తున్నాం
రూ. 10వేల కోట్లతో తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమచేశాం
అన్నా క్యాంటీన్ ద్వారా ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది భోజనం చేశారు
కోట్లాది రూపాయలతో పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్నాం
గ్యాస్ సంస్థలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తూ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది
రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ. 6310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తాం:



మంత్రి
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ ట్రూఅప్ చార్జీలను పూర్తిగా రద్దు చేశాం. విద్యుత్ ఛార్జీలను 29 పైసలు తగ్గిస్తున్నాం. రాబోయే మూడేళ్లలో ఒక యూనిట్ కు 1.27 పైసలు తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సూపర్ సిక్స్ లో ఆరు పథకాలు చెప్పి 60కి పైగా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
