రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో మల్ల అచ్చుత భారతి (54) మృతి చెందింది.
దుక్కవాని పాలెం ప్రాంతంలో తన అక్క కూతురు చదువుతున్న కెకెఆర్ గౌతమ్ పాఠశాల వద్దకు అమ్మాయిని చూడటానికి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొనడంతో తీవ్ర గాయా
లై అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు స్వగ్రామం వడ్లపూడి కూర్మన పాలెం సమీపానికి చెందినదిగా గుర్తించారు.
ఈ ఘటనపై మృతురాలి భర్త లక్ష్మిజి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
