వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన

0

ఢిల్లీ: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అది కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డీ లిమిటేషన్ తరువాతనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయన్న మాట. తనను కలిసిన పలు రాష్ట్రాలఎంపీలతో అమిత్ షా ఈ విషయం చెప్పారు. జనగణన నిర్దేశిత సమయానికే పూర్తవుతుందని అమిత్ షా అన్నారు.

జనగణనకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిదే. ఈ జనగణన రెండు దశలలో పూర్తి కానుంది. ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. డీలిమిటేషన్లో ఎస్సి ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 2027 నాటికి జనాభా లెక్కల సేకరణ పూర్త వుతుందనీ, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలౌతుందనీ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *