వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి

0

తెలంగాణ: వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు

. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి పట్టణంలోని సమ్మయ్య నగర్‌, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుని, అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, నాలాలను పరిశీలించి, మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. తక్షణం పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.

ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, తక్షణం తీసుకోవలసిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *