వేద పాఠశాల నిర్మాణానికి 2 ఎకరాల భూమి 2 కోట్లు నగదు
వేద పాఠశాల నిర్మాణానికి 2 ఎకరాల భూమి 2 కోట్లు నగదు
అమరావతి
: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి భీమవరానికి చెందిన వృద్ధ దంపతులు రాయసం వెంకటరామయ్య, జయలక్ష్మి భూరి విరాళం ఇచ్చారు. పెన్నాడ అగ్రహారం రైల్వేస్టేషన్ సమీపంలో రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమి, రూ.2 కోట్లను వారు అందించారు. కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వెంకటరామయ్య హైదరాబాద్ లో స్థిర పాడారు.
