సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ: స్థానిక ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్థులో గల సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సెమీ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయం తెలిపారు. ఉద్యోగులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం వంటి విలువలను క్రిస్మస్ సందేశం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడేలా ఇటువంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు.
జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటేనే శాంతి, సమాధానాలకు నిదర్శనం అని అన్నారు. ప్రపంచ ఐకమత్యానికి క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. క్రిస్మస్ పండుగ అంటేనే ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో శాఖ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ సందేశాలు, శుభాకాంక్షలు పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు బి. పూర్ణచంద్రరావు, పి. వెంకట్రాజు గౌడ్, డి. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు పి. రాజశేఖర్, ఏఎస్ వీరభద్రరావు, తిరుపాలయ్య, ఎస్ వీ మోహనరావు, ఏవో పి. సుదర్శనరావు, జేఈవో నాగరాజు, పీఆర్వోలు, సూపరిండెంట్లు, ఉద్యోగులు తదితరలు పాల్గొన్నారు.
