సముద్రంలో తేలియాడుతున్న టిక్కింగ్ టైమ్ బాంబ్..!
రష్యా జెండా కలిగిన ఆర్కిటిక్ మెటాగ్యాజ్ నౌక ఇటలీ-మాల్టా తీరాల మధ్యలో ప్రమాదకర పరిస్థితుల్లో సముద్రంలో తేలియాడుతోంది. మధ్యధరా సముద్రంలో మార్చి 3న ఈ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆంక్షల కారణంగా రష్యా ఈనౌకను సముద్రంలోనే వదిలేసింది. ప్రస్తుతం నౌకలో 900 మెట్రిక్ టన్నుల డీజిల్, 60,000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ ఉంది. దీన్ని టిక్కింగ్ టైమ్ బాంబ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఇటలీ, మాల్టాలు ఆందోళనలో ఉన్నాయి.
