సీఎం చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి: అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ని మర్యాదపూర్వకంగా కలిసి శాఖ సంబంధిత అంశాలపై చర్చించారు. రవాణా వ్యవస్థ అభివృద్ధి, సేవల మెరుగుదల, యువతకు అవకాశాల విస్తరణపై సీఎం ప్రత్యేక మద్దతు అందిస్తున్నందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంటా శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు.
